PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఎస్ఎస్ సి , ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిసి లక్ష్మీనారాయణపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి మహానంది, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేంద్ర, వినోద్, దినేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఎస్ఎస్ సి , ఇంటర్మీడియట్ స్టడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఆయా స్టడీ కేంద్రాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ దాదాపు 200కు పైగా ఉన్నాయన్నారు. గతంలో 2016 సంవత్సరంలో నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలు రాసినందుకు పరీక్ష కేంద్రం ఉండేదని రాను రాను అడ్మిషన్స్ తక్కువ కావడం వలన పరీక్ష కేంద్రాన్ని కర్నూలు జిల్లాకు తరలించడం జరిగిందన్నారు. నందికొట్కూరు కేంద్రంగా వివిధ మండలాల్లో మొత్తం దాదాపు 200 అడ్మిషన్స్ ఉన్నప్పటికీ పరీక్ష కేంద్రాన్ని వేయమని పలుమార్లు జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ ను కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం డివిజన్ కేంద్రాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని వేయాలని నిబంధనలు ఉన్నాయని సమాధానం చెపుతూ ఆత్మకూరు లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదన్నారు. నందికొట్కూరు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ 40 కిలోమీటర్లు ఆత్మకూరుకి ప్రయాణం చేసి పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిసి లక్ష్మీనారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో మాదిరిగానే పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని నందికొట్కూరు లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

About Author