స్పందన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి : జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల : నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 27-03-2023 ) నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు 120 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు .చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ,స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ,అత్తరింటి వేదింపులు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదుల పై అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మరియు ప్రతి సోమవారం ప్రతి పోలీసు స్టేషన్ ,సర్కల్ ఆఫీసు,డిఎస్పి ఆఫీసులలో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు కార్యాలయానికి సంబందిత సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ గారు ,ఎస్సీ/ ఎస్టీ సెల్ డిఎస్పి రామంజి నాయక్ పాల్గొన్నారు.