100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
1 min read– పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్, పెన్నులు పంపిణీ
– బాలకృష్ణ..మోక్షజ్ఞ సేవాసమితి అధ్యక్షుడు . బండారు శ్రీను
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నందమూరి బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ సేవాసమితి అధ్యక్షుడు బండారు శ్రీను ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి సుభాన్ అధ్యక్షతన ప్యాడ్, పెన్ను పెన్సిల్ ,మాస్కులు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు నుండి ఈ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని కుటుంబానికి తల్లిదండ్రులకు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. నంద్యాల పార్లమెంటు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, టిడిపి నాయకులు బండి జయరాజ్ సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇలాగే ఎగ్జామ్ ప్యాడ్లు ,పెన్నులు ,పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పాఠశాల ప్రధమ ద్వితీయ ర్యాంకులు సాధించిన వారికి వెండి పతకాలు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం పాఠశాలకు ఆరు కుర్చీలు విరాళం గా ప్రకటించారు. .కార్యక్రమంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్,ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి, యోగేంద్ర బాబు,స్వామినాథం, పగిడ్యాల మండలం టిడిపి కన్వీనర్ పలచారి మహేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు మాసూం భాష, గౌరవ అధ్యక్షులు రహిమాన్ సెక్రటరీ కిషోర్, ట్రెజరరీ తిక్కయ్య, మరియు బాలయ్య ఫ్యాన్స్ త్యాగరాజు, నాగరాజు పగడం శేఖర్, మహేష్ ,రంజిత్ ,పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.