బి .ఎస్ .ఏ పోస్టర్ ను ఆవిష్కరించిన కృష్ణాజిల్లా జడ్.పి.చైర్మన్
1 min read– ఉప్పాల హారిక రాము
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: సాహిత్యం కళలు వ్యక్తిత్వ వికాసానికి ప్రజా చైతన్యానికి ప్రతీకలని కృష్ణాజిల్లా జడ్.పి.చైర్మన్ ఉప్పాల హారిక రాము అన్నారు.అటువంటి రంగాల్లో సమాజ శ్రేయస్సుకు సేవలు అందిస్తూన్న వ్యక్తులకు గుర్తింపుగా ప్రోత్సహాక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బి.ఎస్.ఏ. సంస్థ కృషి ప్రశంశ నీయమని ఆమె పేర్కొన్నారు.బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏప్రియల్ 14 న ఉయ్యూరు లో నిర్వహించ తలపెట్టిన బి.ఎస్.ఏ. నేషనల్ అవార్డ్స్ -2023 పంపిణీ కార్యక్రమ పోస్టర్ ను పెడన లో ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 124 వ జయంతి రోజున ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు బైపాస్ రోడ్ లోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ ఆవరణలో బహుజన సాహిత్య అకాడమీ ఎంపిక చేసిన వివిధ రంగాలలోని విశేష సేవలు అందించిన వ్యక్తులకు అవార్డులను అందచేయనుంది.ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ,బిసి.హక్కుల ఉద్యమ నిర్మాత ఆర్.కృష్ణయ్య తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు,వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ నేతృత్వంలో బి.ఎస్.ఏ. ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరగనుంది.ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పెడన మండలం కృష్ణా పురం లో బి.ఎస్.ఏ. నేషనల్ అవార్డ్స్ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన కృష్ణాజిల్లా జడ్.పి.చైర్మన్ ఉప్పాల హారిక రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదర్శ భావాలు ,ఉత్తమ వ్యక్తిత్వంసమాజ హితం వంటి మంచి లక్షణాలు సాహిత్యం,రచనలు,కళల ద్వారా అందుతాయని అన్నారు.ముఖ్యంగా బహుజన సాహిత్య వికాసం కోసం బహుజన సాహిత్య అకాడమీ జాతీయ స్థాయిలో చేస్తున్న కృషి ని ఆమె అభినందించారు. ప్రపంచ జ్ఞాన దినోత్సవం రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి రోజు బి.ఎస్.ఏ.చేపట్టే కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని చైర్మన్ హారిక పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బి.ఎస్.ఏ.రాష్ట్ర అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్,ప్రతినిధులు కె.సురేష్ ,కాటూరి గౌతమి,కోలా దుర్గా భావాని ,నారా గాని రజని,పొలిమెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.