పోటాపోటీగా పంచాయతీ వేలం పాటలు
1 min read– పంచాయతీకి పెరిగిన ఆదాయం
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండలకేంద్రమైన గోనెగండ్ల పంచాయతీ కార్యాలయంలో డీఎల్పిఓ నూర్జహాన్ ఆధ్వర్యంలో పంచాయతీ వేలం పాటలు పోటాపోటీగా సాగాయి. గతేడాది కంటే ఈ ఏడాది పంచాయతీకి ఆదాయం పెరిగింది.గోనెగండ్ల పంచాయతీ పరిధిలో బండి మెట్ట, కమేలా, సంత మార్కెట్ లకు వేలం పాటలు నిర్వహించారు. వేలం పాటలో ఈసారి అధిక సంఖ్యలో వేలం దారులు పాల్గొనడంతో పోటాపోటీగా సాగాయి. బండిమెట్టను రూ.1 లక్ష 70వేలకు బండి మెట్ట బడే సాహెబ్ దక్కించుకోగా, కమేలాను రూ.1లక్ష17వేలకు కడపల గోపాల్,సంత మార్కెట్ వేలం పాటను రూ.70 వేలకు కడపల గోపాల్ దక్కించుకున్నారు. వేలం పాటలో బండి మెట్ట, సంత మార్కెట్, కబేలా లను వేలంపాటలో దక్కించుకున్న వారు ఈనెల 31 వ తారీకు లోగా డబ్బులు చెల్లించాలని, చెల్లించలేని ఎడల మరల వేలంపాట నిర్వహిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఈ నిధులను ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచి హైమావతి, పంచాయతీ కార్యదర్శి రంగనాయకులు, సిబ్బంది సతీష్, సుబాస్, అనిల్,మలాంగ్ పాల్గొన్నారు.