ఉపాధి వేతనాలను తక్షణమే చెల్లించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం ఉపాధి కూలీలు ధర్నా చేశారు. ఉపాధి కూలీలు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట దాదాపు గంటపాటు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు దస్తగిరి ఉపాధి మీటింగ్ నాయకులు నరసన్న మాట్లాడుతూ ఉపాధి కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. దాదాపు 8 వారాల నుండి ఉపాధి కూలీలకు వేతనాలు అందలేదని దీంతో కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఉపాధి కూలీలకు ప్రభుత్వము పెట్టిన నిభందనలు కూలీలకు పెను శాపంగా మారాయని అన్నారు. కూలీల అటెండెన్స్. అక్విటెన్స్ విధానంలో మార్పులు చేయాలని కోరారు. వేసవిలో ఉపాధి కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎంపీడీవో పార్థసారధికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, బుజ్జులు తదితరులు పాల్గొన్నారు.