సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలి
1 min read– దళిత క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..
– పెరికె వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు కి దళితులన్న , దళిత క్రైస్తవలన్న అవగాహన లేని వ్యక్తి అని పెరికే వరప్రసాద్ అన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే సోము వీర్రాజు కి దళితుల పట్ల అవగాహన లేని మాటలు మాట్లాడటం తగదని తక్షణమే దళిత క్రైస్తవులకు సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘ నాయకులు కండించారు. సోము వీర్రాజు భారత రాజ్యాంగాన్ని ఉల్లంగిoచ్చినట్టే భారత రాజ్యాంగంలో రిలీజ్ చేయడం ఉంది. మత స్వేచ్ఛ హక్కు ఉన్నది. ఎవరు ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని. అలాంటప్పుడు దళితులు ఏ మతాన్ని స్వీకరిస్తే సోము వీర్రాజు కి బిజెపి నాయకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. క్రైస్తవులు దళితులు బిజెపికి వ్యతిరేకం కాదని దళితుల ఓట్లతోను నాడు, నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. తక్షణమే ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.