మహిళల ఆర్థిక భరోసా కు ఆసరా జగనన్న
1 min read– వచ్చే ఎన్నికల్లో వైసీపీ దే విజయం.. కాటసాని రాంభూపాల్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు.మండల కేంద్రమైన గడివేములలో బుధవారం నాడు స్థానిక రాజరాజేశ్వరి హై స్కూల్ లో ఏర్పాటుచేసిన ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మండలంలోని 597గ్రూపులు 5970 మంది స్వయం సహాయక పొదుపు మహిళలకు వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద మంజూరైన రూ. 21222200/- చెక్కును ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అందజేశారు. గత ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి మోసం చేశారని పథకాల అమలు చేయడంలో విఫలమై పొదుపు మహిళల గ్రూపులకు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో డిఫాల్డర్ గా మార్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దేనిని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో ఇంటికి రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ చేస్తానని తెలుగు దేశం పార్టీ అధినేత మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఆర్థిక లోతుల్లో కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిఆని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇస్తూ మరియు వేసవికాలంలో మెనూలో విద్యార్థులకు రాగిజావను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పీటీసీ ఆర్బీ చంద్రశేఖర్ రెడ్డి,తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, శివరాం రెడ్డి. రఘు మాధవ్ రెడ్డి. ఎల్లారెడ్డి. శిరుపా శ్రీనివాస్ రెడ్డి. కోర్రపోలూరు సర్పంచ్ మాలిక్ బాషా. సుబ్బారెడ్డి.పొదుపు ఐఖ్య సంఘం అధ్యక్షురాలు అనురాధ,, ఏపీఎం ఉస్మాన్, సీసీ శ్రీనివాసులు, వెంకటరాముడు, నాగశేషు, విఓఎల అధ్యక్షులు రామ మద్దిలేటి, పొదుపు మహిళలు పాల్గొన్నారు.