15 ఏళ్ల రహదారి సమస్య పరిష్కారం
1 min read– శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కృషితో గ్రామాభివృద్ధి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామములో నూతనంగా నిర్మించే సీసీ రహదారి పనులను బుధవారం సర్పంచు రవి యాదవ్ ప్రారంభించారు. ప్రత్యేక నిధులతో సుమారు రూ. 20 లక్షలతో రహదారి పనులు నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచు రవి యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని దళిత కాలనీలో సీసీ రహదారి నిర్మాణం పేరుతో గతంలో ప్రజా ప్రతినిధులు పూజ కార్యక్రమం నిర్వహించడం మాత్రమే చేశారు. కానీ 15 ఏళ్లుగా సీసీ రహదారి నిర్మాణం చేపట్టలేదన్నారు.కాలనీ వాసులు వర్ష కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తీసుకెళ్లడం జరిగిందన్నారు.సిద్దార్థ రెడ్డి కృషితో ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు కావడంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలనీలో సీసీ రహదారి నిర్మాణం పనులు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచి అభూబక్కర్, వార్డు సభ్యులు మహమ్మద్ రఫీ , శ్రీరాములు, బాలీశ్వరయ్య ,మల్లి కార్జున .గ్రామస్తులు ఏసు రత్నం, రమణయ్య, చికెన్ శ్రీను, సురేష్, తదితరులు పాల్గొన్నారు.