ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించండి : TNSF మునీర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 10 వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పెద్ద మనసుతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చి సహకరించాలని శ్రీశైలం నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఉపాధ్యక్షుడు సయ్యద్ మునీర్ విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భ0గా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీద విద్యార్థులు ప్రభుత్వం ఇస్తామన్న అమ్మఒడి స్కీ0 వస్తే స్కూల్ ఫీజ్ కట్టాలనే ఉద్దేశంతో చదువుతున్నారని తెలిపారు, 10 వ తరగతి విద్యార్థులకు అమ్మఒడి స్వయానా వారి అకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ పాఠశాల వారు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో అమ్మఒడి తమ ఖాతాలోకి రాగానే పాఠశాల వారికి ఫీజ్ కడతామని ఒప్పంద పత్రం రాయించుకోవాలని సూచన చేశారు, విద్యార్థుల భవిషత్తు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు హాల్ టికెట్ మంజూరు చేయాలని చేతులెత్తి ప్రైవేట్ యాజమాన్యాన్ని కోరారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా కష్టపడి ఉపాధ్యాయులకు జీతాలిచ్చి విద్యార్థులకు చదువులు చెప్పారని విద్యార్థుల తల్లితండ్రులు కూడా అవకాశం ఉన్నవారు మొత్తం పాఠశాల ఫీజ్ చెల్లించి హాల్ టికెట్ పొందాలని, అవకాశం లేని వారు తప్పకుండా అమ్మఒడి ఖాతాలోకి రాగానే పాఠశాల ఫీజ్ చెల్లించాలని విజ్ఞప్తి చేసారు. పదవ తరగతి వ్రాయబోయే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయలన్నారు. ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు పరీక్షల అనంతరం ఇంటి వద్దే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య పట్టణ నాయకులు షేక్.ఫారూఖ్, మూర్తుజ వలి పాల్గొన్నారు.