PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘టీజీవీ’ కాన్సంట్రేటర్లు, మల్టీపారామీటర్లు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కరోన వైరస్​ నియంత్రణలో భాగంగా టీజీవీ సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ సంస్థ చైర్మన్​ టీజీ భరత్​ అన్నారు. ఈ నెల 16న రాజ్య సభ సభ్యలు టీజీ వెంకటేష్​ జన్మదినం సందర్భంగా రూ.1.25 కోట్లతో కోవిడ్​–19 నివారణకు సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క‌ర్నూలు ప్రభుత్వాసుప‌త్రికి ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లు , మ‌ల్టీపారామీట‌ర్లను అందజేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్​ మాట్లాడుతూ ఇవే కాకుండా నైట్రోజ‌న్ నుంచి ఆక్సిజ‌న్ త‌యారుచేసే ప్లాంట్ ఏర్పాటు ప‌నులు కూడా జరుగుతున్నాయ‌న్నారు. ఇది త్వర‌లోనే పూర్తవుతుంద‌న్నారు. ఇవే కాకుండా ప‌లు గ్రామాల‌కు బావుల నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు కూడా చ‌ర్యలు వేగ‌వంతం చేసిన‌ట్లు చెప్పారు. ప్రజ‌ల‌కు టి.జి.వి సంస్థల స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ న‌రేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, ఇండ‌స్ట్రీస్ జీ.ఎం. సోమ‌శేఖ‌ర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామ‌కృష్ణారెడ్డి, పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ ఈ.ఈ ముని ప్రసాద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టి.జి వెంక‌టేష్‌, టి.జి భ‌ర‌త్‌కు హాస్పిటల్​ సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​ రెడ్డి, సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.

About Author