PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

1 min read

– కనపర్తి లో బండలాగుడు పోటీలు ప్రారంభించిన ..ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు టౌన్ అలాగే, మండలంలోని, కనపర్తి , కొండపేట, ఓబులంపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది, అంతకుముందు ఆయన కనపర్తి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు, ఈ ఎడ్ల బండ లాగుడు పోటీ లకు జిల్లా నలుమూలల నుండి పది జతల ఎడ్లు రావడం జరిగింది, ఈ ఎడ్లబండ లాగుడు పోటీలను తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు,, అనంతరం కనపర్తి గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పల్లె కృష్ణారెడ్డి, ఎంపీటీసీ రఘురామిరెడ్డి అలాగే గ్రామంలోని పెద్దలను పేరుపేరునా పలకరిస్తూ అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం చెన్నూరు లోని శ్రీ సీతారామ నామ సంకీర్తన క్షేత్రము నందు ప్రత్యేక జిల్లా లో పాల్గొన్న ఎమ్మెల్యే కు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించడం జరిగింది, అదేవిధంగా అరుంధతి నగర్ లో ఆదివారం అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఆలయ నిర్వాహకులు వేదపండితుల మంత్రోచ్ఛారణల తో నిర్వహించారు, స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా వేకువజాము నుండి నుండి స్వామివారికి, అభిషేకాలు, ప్రత్యేక పూజలు గా గావించారు , అలాగే భక్తులకు స్వామివారి దర్శనం, అనంతరం 10 గంటల నుండి వేదపండితుల మంత్రోచ్ఛారణల తో స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం జరిగింది, తదుపరి 12:30 గంటల కు మహా సంతర్పణ కార్యక్రమంనిర్వహించారు, సాయంత్రం మూడు గంటల నుండి స్వామిగ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది.. ఇందులో ఎడ్లబండ్ల కు సంబంధించిన బహుమతులు , కార్యనిర్వాహకులు అందజేయడం జరిగింది , మొదటి బహుమతిగా 20 వేల రూపాయలు, అదేవిధంగా రెండవ బహుమతి గా 15 వేల రూపాయలు, మూడో బహుమతి గా పదివేల రూపాయలు అందజేసినట్లు ఎంపీటీసీ రఘురాం రెడ్డి తెలిపారు, పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు, వేద పండితుల మంత్రోచ్ఛారణల తో స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఓబులంపల్లె గ్రామంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు, అనంతరం ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, , ఎంపీటీసీ ముది రెడ్డి సుబ్బా రెడ్డి, దుంప నాగి రెడ్డి, సర్పంచులు సిద్ది గారి వెంకటసుబ్బయ్య, తుంగ చంద్ర శేఖర్ యాదవ్, బక్కెద్దులప్రసాద్ రెడ్డి, మిట్ట కేశవరెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి , పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి , సురతాని శ్రీనివాసులు, వైయస్సార్ సిపి నాయకులు పీసీ కేశవరెడ్డి, కిరణ్, భూషణం, శాస్త్రి, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author