మహానంది క్షేత్రంలో ముత్యాల తలంబ్రాలతో సీతారామ కళ్యాణం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : మహానంది క్షేత్రంలో ముత్యాల తలంబ్రాలతో సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి మహా పర్వదిన సందర్భంగా క్షేత్రంలో గురువారం ఉదయం రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీతారామ మరియు లక్ష్మణ, హనుమంత్ ఉత్సవమూర్తులను భక్త జన సమూహంతో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ వేదికకు పల్లకిలో తీసుకొని వచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు వేదమంత్రోచరణలు మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించి సీతారామ కళ్యాణాన్ని భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక దాత సహాయంతో అందించిన ముత్యాల తో సీతారామ కళ్యాణం నిర్వహించారు. అనంతరం సాయంత్రం హనుమత్ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ కే మహేశ్వర్ రెడ్డి పాలకమండలి సభ్యులతో పాటు వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ శాంతారాం బట్ ఏఈఓ మధు ఆలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.