గొనెగండ్ల లో వైయస్ఆర్ ఆసరా సంబరాలు
1 min read– అక్క చెల్లెమ్మలకు అండగా జగనన్న: ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ,డి ఆర్ డి వైకేపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, కర్నూలు నగర మేయర్ బీ. వై రామయ్య లు పేర్కొన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లో స్ధానిక భాషా ఫంక్షన్ లో 565 పోదుపు గ్రూపులు గాను 6780 మంది స్వయం సహాయక పొదుపు మహిళలకు వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద మంజూరైన రూ. 34845000/- చెక్కును ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అందజేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో పొదుపు మహిళల కష్టాలు నేరుగా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణం మాఫీ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి ప్రలోభపెట్టిందేకాని అమలు చేయడంలో విఫలమై మహిళలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో ఇంటికి రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని వివరించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కరోనా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, వాటన్నింటిని తట్టుకొని ప్రతి నెల, ప్రతి సంవత్సరం అందరికీ పెన్షన్, అమ్మ ఒడి, ఆసరా లాంటి 25 పథకాలను నేరుగా బటన్ నొక్కి, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడేలా జగనన్న కృషి చేస్తున్నారని అన్నారు. ఎలాంటి దళారీ వ్యవస్థను లేకుండా నేరుగా ప్రజల వద్దకే పథకాలను చేర్చిన ఘనత జగనన్నదని అన్నారు. ప్రజల ఇంటి వద్దకే పథకాలను, ప్రజాప్రతినిధులను వచ్చేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వారు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య బోధన, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి పెంచి, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం సీట్లు ఖాళీ లేని పరిస్థితికి తీసుకురావడం జగనన్నకే సాధ్యమన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పాఠశాలల అభివృద్ధి, ఉచిత పుస్తకాలు, ఉచిత బ్యాగులు, జగనన్న గోరుముద్ద లాంటి పథకాలు విద్యార్థుల కోసం చేపట్టడం జరిగిందన్నారు. పిల్లలు బలంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతిపక్ష టిడిపి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసి రాజకీయం చేస్తున్నారని, జగనన్న మాత్రం రాజకీయాల కతీతంగా అందరికీ నవరత్నాలు అందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళలు, లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలభీషేకం చేసినారు.ఈ కార్యక్రమంలో వైకేపి ఏసీ శ్రీనివాస్ లు,ఏపిఎం హేమలత, తహశీల్దార్ వేణు గోపాల్ శర్మ, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, ఎల్ సి,మధు,సీసీ లు షబీనా,ఈరమ్మ, లలితా రాణి, శకుంతల,వెంకన్న, వీరు కృష్ణుడు,ముక్కన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు తిమ్మక్క , మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,మండల అధ్యక్షులు నసురు ద్దిన్,మండల వైస్ చైర్మన్,వెంకట్రామిరెడ్డి,టీ రమణి కుమారి, గోనెగండ్ల సొసైటీ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,మండల కన్వీనర్ దొరబాబు నాయుడు,మండల యూత్ అధ్యక్షులు టి.బందేనవాజ్, మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు,మండల వైసీపీ నాయకులు మురళి నాయుడు,రంగన్న నాయుడు,నద్దీముల్లా, రఫీక్,కటికే మాబువలి, ఎంపీటీసీ తాయన్న, ఉసేన్ పటేల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.