పాఠశాల ఉపాధ్యాయులను అవమాన పరచడం దారుణం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పాఠశాల ఉపాధ్యాయులను అవమాన పరచడం దారుణమని , ఇన్విజిలేటర్ విధులను పూర్తిగా బహిష్కరిస్తామని ఫ్యాప్టో సంఘం నేతలు రోషన్న, నాగేశ్వరరావు లు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఎం ఈ ఓ కార్యాలయంలో ఫ్యాప్టో నేతలు ఎం ఈ ఓ ఫైజాన్నిసా బేగం ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను అవమాన పరిచారని, అగౌరపరిచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఉపాధ్యాయులను వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఉపాధ్యాయులందరు గత ఏడాది ఇన్విజిలేషన్ విధులలో అవకతవకలు జరిగిన ఉపాధ్యాయులను తహశీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోమని చెప్పడం సిగ్గుచేటన్నారు. విద్యాశాఖ అధికారులు క్షమాపణ చెప్పేంత వరకు విధులకు హాజరు కామని ఇన్విజిలేటర్ విధులను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రాజసాగర్, రాజశేఖర్ రెడ్డి, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.