సిపిఎం మాజీ ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, సిపిఎం కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎం ఏ గఫూర్ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . శనివారం పత్తికొండ పట్టణంలోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ (ఆర్ టి డి ) సొసైటీ వృద్ధాశ్రమంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్ జన్మదిన వేడుకలను సిపిఎం నాయకులు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ప్రజాసేవలో ప్రజల కోసం నిరంతరంగా పోరాడేవారని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి కొనియాడారు. విద్యార్థి దశ నుండి ప్రజా సమస్యల పట్ల ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాల కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారని వారన్నారు ఆయన కర్నూల్ నగరానికి రెండుసార్లు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రస్తుతం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారని ఆయన జీవితం ప్రజా జీవితానికే అంకితమని వారన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి మధుబాబు ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కాశీ సిఐటియు మండల అధ్యక్షుడు కాశి విశ్వనాధ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి నరసన్న అధ్యక్షులు బుజులు ఉపాధ్యక్షులు ఈరన్న కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ ఆవాజ్ కమిటీ జిల్లా నాయకులు తాజ్ మహమ్మద్ ఎస్ ఎఫ్ఐ నాయకులు మధు, అడ్వకేట్ వాసుదేవ నాయుడు, ఆవాజ్ కమిటీ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.