( టిబిహెచ్ వి) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..
1 min read– ఈనెల ఆరవ తేదీ వరకు గడువు
– డిఎంహెచ్ ఓ డా: ఆశ, క్షయ వ్యాధి నివారణ అధికారి డా: రత్నకుమారి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు ప్రకారం జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయ పరిధిలో ఎన్ హెచ్ఎం- ఎన్ టిఇపి స్కీం నందు సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్(ఎస్ టిఎస్) సీనియర్ ట్రీట్ మెంట్ ల్యాబ్ సూపర్ వైజర్ (ఎస్ టిఎల్ఎస్), డిఆర్ టిబి సెంటర్ గణంకాల అసిస్టెంట్, ఆర్ఎన్ టిసిపి ల్యాబ్ టెక్నిషియన్ / కఫం మైక్రోస్కోపిస్ట్ మరియు క్షయవ్యాధి హెల్త్ విజిటర్(టిబిహెచ్ వి) పోస్టులకు సంబంధించి దరకాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అప్లికేషన్స్ లో పొందుపరచబడిన వివరములు ప్రకారము ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ తయారుచేసిన పిదప జిల్లా వెబ్ సైట్ westgodavari.ap.gov.in, eluru.ap.gov.in నందు పొందుపరచడమైనదని డిఎంహెచ్ఓ డా. డి.ఆశ, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జి. రత్న కుమారి శనివారం సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. కావున దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ యొక్క ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ ను చూచిన పిదప ఏమైనా అభ్యంతరములు ఉన్నయెడల వాటికీ సంబందించిన తగు ధ్రువీకరణ పత్రములతో జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయము, రూమ్ నెం: 77, గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్, ఏలూరు, ఏలూరు జిల్లా నందు ది 03.04.2023 నుండి 06.04.2023 వరకు (కార్యాలయపు పని దినములలో) ఉదయం 10 గం. నుండి సాయంత్రం 5 గం. లోపు స్వయముగా సమర్పించవలసిందిగా తెలిపారు. ద 06.04.2023 సాయంత్రం 5.00 గంటల తర్వాత వచ్చినటువంటి అభ్యంతరములు పరిగణలోకి తీసుకొనబడవని తెలియజేశారు.