PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు మంజూరు

1 min read

పల్లెవెలుగువెబ్​, విజయవాడ: నూజివీడు బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పని చేస్తూ గత నెల 21 న మరణించిన జి. ప్రసాదరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్​ హామీ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్​లో వంట మనిషి ప్రసాదరావు భార్య జి. విజయలక్ష్మికి కలెక్టర్​ అంతియాజ్​ రూ. 2లక్షల ఎక్స్​ గ్రేషియా ఉత్తర్వులు అందజేశారు. దినసరి కూలీగా వసతి గృహంలో పనిచేస్తు మరణించిన ప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(సంక్షేమం) కె.మోహన్ కుమార్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాందయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author