విద్యార్థులకు బస్సు సౌకర్యము కల్పించాలని విజ్ఞప్తి
1 min read– గిరిజన సమైక్య అధ్యక్షుడు కాలింగ్ రాముడు విజ్ఞప్తి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం , టెన్త్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మూడవ తేదీ తొమ్మిది ఖరారు చేశారు ఉదయం 9 గంటలకు విద్యార్థిని , విద్యార్థులు, ఎగ్జామినేషన్ సెంటర్లలో దగ్గరకు రావాలంటే బస్సు సౌకర్యాలు ఆర్టీసీ యాజమాన్యం కల్పించాలి టెన్త్ ఎగ్జామ్ వ్రాసే విద్యార్థినీ విద్యార్థులు హాజరు కావాలంటే సుధూరు గ్రామాల నుండి రావటానికి ఆర్టీసీ డిపో వారు విద్యార్థిని విద్యార్థులకు బస్సు సౌకర్యము కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ విద్యార్థిని బస్సులకు అనుభవం కలిగిన సీనియర్ డ్రైవర్లను నియమించాలని ఎగ్జామినేషన్ రాసే విద్యార్థిని విద్యార్థులకు, టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉన్నవారికందరికీ ఫ్రీగా, ఎలాంటి రుసుము తీసుకోకుండా ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసుకెళ్లాలని ఆర్టీసీ డిపో మేనేజర్లకు కాలింగి రాముడు విజ్ఞప్తిచేశారు. అలాగే ఎగ్జామ్స్ సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని వేరే వ్యక్తులు అసాంఘిక చర్యలు చేస్తుంటే పోలీసు వారికి తెలియజేయవలసినదిగా- కాలింగ్ రాముడు కోరారు టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ గా చెప్పారు.