ప్రాణ ప్రదాత నిరంతర ప్రజా సేవకుడు అబ్బయ్య చౌదరి
1 min read– నియోజకవర్గంలో పలువురి కుటుంబాలను పరామర్శ
పల్లెవెలుగు వెబ్ దెందులూరు : నిరంతరం ప్రజల్లో ఉండి నియోజకవర్గ ప్రజలను కంటికి కనురెప్పల కాపాడుతూ ప్రజా సమస్యలే తన కుటుంబ సమస్యలుగా భావిస్తూ నియోజకవర్గ ప్రజల్లో ఎనలేని మన్ననలు అందుకుంటున్నారు కొటారు అబ్బాయి చౌదరి, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరు నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన సభను విజయవంతం చేయడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాత్ర కీలకమని చెప్పవచ్చు , అక్కచెల్లెమ్మల ఆనందాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చూసి పులకించి పోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని స్వయంగా సందర్శించి వారి కష్టసుఖాలల్లో పాలుపంచుకుంటూ వారికి చేదోడు వాదోడుగా సొంత వ్యయంన్నే కాకుండా. ప్రభుత్వం పరంగా అందించే ఆర్థిక సహాయాన్ని గొప్ప మనసుతో అందించటం ఆయన పరోపకారనికి నిదర్శనమని చెప్పవచ్చు. దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామానికి చెందిన హేమలత కుమార్తె భవ్య శ్రీ మల్లిక గుండె ఆపరేషన్ నిమిత్తం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని కలిసి వేడుకొనగా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి కి వారి ఆర్థిక పరిస్థితిని వివరించారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ద్వారకాతిరుమల హాస్పటల్ కు సిఫార్సు చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయించి ముఖ్యమంత్రి తన అవునత్యాన్ని చాటుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు సీఎం సభలో ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటారు అబ్బాయి చౌదరిని కలిసి చేసిన మేలును మర్చిపోకుండా హేమలత కుటుంబ సభ్యులు ఆయనకు ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామ ఉపసర్పంచ్ రాగం కనకదుర్గ వైద్యానికి అయినా ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా అనారోగ్యంతో మృతి చెందిన దెందులూరు మండలం గోపాలపాలెం గ్రామానికి చెందిన వీరంకి మృత్యుంజయరావు వైద్యానికి అయిన ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి లక్ష రూపాయలు మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అబ్బయ్య చౌదరి అందజేశారు. దానిలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి నాగ లక్ష్మి ని పరామర్శించి. వైద్య ఖర్చులు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రెండు లక్షల2,80,000/- వేల రూపాయలు చెక్కును అందజేసి ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి గ్రామంలో ఉన్న ప్రజల బాగోగులపై మరోసారి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు.