బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శంఖారావం పూరించండి
1 min read– వామపక్షాల పిలుపు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు శంఖారావం పూరించండి వామపక్ష పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా నాయకులు బి రామాంజనేయులు అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఏప్రిల్ 14వ తేదీ నుండి 30 తేదీ వరకు పాదయాత్రలు జిల్లాలో చేపడతామని సిపిఐ జిల్లా కార్యదర్శి గిద్దయ్య గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రజల్లో తీసుకెళ్తామని, ఆర్థిక విధానాలపై, అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, జీఎస్టీ, అధిక ధరల ద్వారా ప్రజల పై పడుతున్న భారాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద వైఖరి, పౌరసత్వం, ఢిల్లీలో దాడులు, మతమార్పిడులు, మైనార్టీలపై, దళితులపై దాడులు చేస్తున్నదని వారు తెలిపారు. బిజెపి అవినీతి కుంభకోణాలు, రాఫెల్ కుంభకోణం, అదాని కుంభకోణం, న్యాయవ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేయడం లాంటి అంశాలు రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో బిజెపి అనుసరిస్తున్నదని వారు విమర్శించారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖకు పరిశ్రమ ప్రైవేటు కరణ పోలవరానికి నిర్లక్ష్యం చేయడం కడప హుక్కు ఊసే ఎత్తకపోవడం రాజధాని నిర్మాణంపై రెండు నాలుకల ధోరణి అనుసరించడం లాంటి బీజేపీ విధానాలను ప్రజల్లోకి పాదయాత్రల ద్వారా తీసుకెళ్తామని వారు తెలిపారు అలాగే పెట్రోల్ డీజిల్ వంటగా ధరలు తోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను చెత్త పన్ను విద్యుత్ చార్జీలు పెంచే అంశాలను కూడా ప్రజల్లోకి వివరిస్తామని వారు తెలిపారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని బిజెపికి వందన వాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిపిఎం సిపిఐ పార్టీలు చేపడుతున్న పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు అందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు పాదయాత్రలు నిర్వహిస్తామని ఆ సభల్లో పాదయాత్రలో ప్రజలు పాల్గొనాలని వారు తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్, జిల్లా నాయకులు జగన్నాథం, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగరనాయకులు శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.