10 వ తరగతి పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతుల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పదవ తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి వీలుగా అన్నమయ్య జిల్లాలో పరీక్షా కేంద్రాలలో ఉన్న వసతుల గురించి పదవ తరగతి పరీక్షల రాష్ట్ర పరిశీలకులు మార్తాల వెంకట కృష్ణారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఏప్రిల్ మూడో తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నేలవారు పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదన్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు, త్రాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో ఉండాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పరీక్ష కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఉప విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.