చనిపోయిన వ్యక్తుల్లో కరోన ఉంటుందా..?
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన బారినపడి చనిపోయిన వ్యక్తుల్లో కరోన ఎంత కాలం బతికి ఉంటుంది ?. కరోన మృతుల నుంచి పక్కవారికి కరోన సోకుతుందా?. దహన సంస్కారాలు చేసే సమయంలో బంధువులకు కరోన సోకే అవకాశం ఉంటుందా?. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్త కీలక విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన వ్యక్తుల్లో కరోన 12 నుంచి 24 గంటలు మాత్రమే బతికి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయం గురించి ఏడాదిగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం పరిశోధన చేస్తోందని చెప్పారు. కరోన పాజిటివ్ తో చనిపోయిన మెడికో-లీగల్ కేసులను పరీక్షించడం ద్వార ఈ విషయాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు.