రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వ రద్దు అప్రజాస్వామికం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు అప్రజాస్వామికం అని సి పీ ఐ రాష్ట్ర కార్యదర్శి పి.రామచంద్రయ్య అన్నారు. సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దును నిరసిస్తూ, ప్రజాస్వామ్యం పరిరక్షించాలని కోరుతూ, పత్తికొండలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో వక్తలు ప్రధాని మోడీ విధానాలను ముక్త కంఠంతో వ్యతిరేకించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్. టిడిపి బిసి. సేల్ రాష్ట్ర నాయకులు పి.రామానాయుడు. అశోక్ కుమార్ వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు జి.సోము శేఖర్. కే.నాగరాజు. సిపిఎం మండల కార్యదర్శి రంగారెడ్డి దస్తగిరి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు క్రాంతి నాయుడు, జనసేన నాయకులు రాజశేఖర్, వివిధ పార్టీ ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు పాల్గొన్నారు.