లక్ష్మీపురం గ్రామo లో ఇదేం ఖర్మ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పతనం ఖరారైందని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్ఛార్జ్ గౌరు చరిత రెడ్డి గారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కల్లూరు 28 వ వార్డ్ లక్ష్మీపురం గ్రామం లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. గ్రామం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తోందో వివరించారు. అనంతరం గౌరు చరితమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసిపి పెద్దల సూచనలతో వైసిపి నాయకులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించేవారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సైకో ముఖ్యమంత్రి సంక్షేమం ముసుగులో పేదల పొట్టకొడుతున్నారని చరిత రెడ్డి ధ్వజమెత్తారు. వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. నియంతగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓట్లేస్తే అందరినీ నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన నాలుగేళ్ళలో పాణ్యo నియోజకవర్గం పరిధిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ముఖ్యంగా పాణ్యo నియోజకవర్గం అవినీతిమయంగా మారిపోయిందని, వైసీపీ పాలకులు ఇష్టారాజ్యంగా దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. నగరంలో పారిశుద్యం పూర్తిస్థాయిలో లోపించిందని, మొక్కుబడి తొలగింపులు తప్ప ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయి, ప్రజలు దోమలతో సహజీవనం చేయాల్సిన దుస్థితి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. జగనన్న ఇళ్ళ కాలనీలతో పేదలను మోసం చేస్తున్న వైసిపి ప్రభుత్వం తమ చేతకానితనాన్ని మభ్యపెట్టేందుకు టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్ళకు వైసిపి రంగులు వేసుకుంటోందని ఎద్దేవా చేశారు.మోసపూరిత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అకేపోగు వెంకట స్వామి,మాజీ ఎంపీపీ మాదేష్,లక్ష్మీపురం సర్పంచ్ పుల్లా రెడ్డి,నాగిరెడ్డి,రాధ కృష్ణ రెడ్డి,మరేన్న,శివ,శేఖర్ కళ్యాణ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్,ధనుంజయ,దొడ్డి పాడు బాషా, బోల్లారం రమణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.