(బయో కెమిస్ట్) 24 ల్యాబ్ లో బిగ్ ప్రింటర్ ..స్కానర్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల బయో కెమిస్ట్రీ 24 ల్యాబ్ లో బిగ్ ప్రింటర్ మరియు స్కానర్ లను ప్రారంభించారు అనంతరం పేషంట్లకు తత్వర రిపోర్టులు అందించాలని ల్యాబ్ సిబ్బందికి ఆదేశించారు.ల్యాబ్ లోని పేషెంట్లకు నిర్ధారణ అయిన టెస్టుల రిపోర్టులను వెంటనే వివిధ విభాగాలకు మరియు పేషెంట్లకు అందజేయాలని ల్యాబ్ సిబ్బందికి ఆదేశించారు.ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే 3000 నుండి 3500 మంది పేషెంట్లు వారి ఆరోగ్యం కోసం వస్తుంటారు IP మరియు ఓపీ చూపించుకోవడానికి ఆసుపత్రికి వస్తుంటారు అనంతరం వారికి మెరుగైన వైద్య సదుపాయాలు మరియు ఇన్వెస్టిగేషన్స్ ప్రతిరోజు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాస్పిటల్ అడ్మిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, 24 ల్యాబ్ సిబ్బంది స్వాములు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.