PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారుణ్య ద్వార జూనియర్ అసిస్టెంట్ గా నియామకం

1 min read

– జీవో 658 అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు..
– రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
– భూపతి రాజు రవీందర్ రాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కారుణ్య నియామకాలు జీవో 658 ప్రకారం పెదవేగి మండలంలో అయినవల్లి శ్రీనివాస్. గత ఏప్రిల్ నెలలో గుండెపోటుతో మరణించడంతో వారి భార్య అయినవిల్లి నాగ ఇందిర కు మంగళవారం కలెక్టర్ చాంబర్లో కారుణ్య నియామకల కింద జూనియర్ అసిస్టెంట్ గా జిల్లాకలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రగ్రామ రెవిన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు ఆధ్వర్యంలో నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జోషి, ఏలూరు జిల్లా నూతనముగా ఏర్పడిన గ్రామ రెవెన్యూ అధికారులజిల్లా సంఘము.జిల్లాఅధ్యక్షులు. ఆర్ సి రామచంద్రమూర్తి. ప్రధాన కార్యదర్శి. సిరిగినీడి సుబ్బారావు , అసోసియేట్ అధ్యక్షులు. ఎస్ కె.అక్బర్, కోశాధికారి డి. రవికుమార్, జిల్లా నాయకులు, కడీకే ప్రసాద్, ఝాన్సీ రాణి, డి. వీరభద్రరావు, ఏలూరు డివిజన్ అధ్యక్షులు, వెంకటేశ్వరరావు , కార్యదర్శి ప్రభాకర్, సింహాచలం పాల్గొన్నారు. అలాగే నూతన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర రాజు మాట్లాడుతూ కారుణ్య నియామకల జీవో 658 తో రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో మొట్టమొదటి గా జూనియర్ అసిస్టెంట్ గా అయినవల్లి ఇందిరకు కారుణ్య నియామకాలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మా గ్రామ రెవెన్యూ అధికారులకు గతంలో ఎప్పుడు లేనివిధంగా చనిపోయిన వీఆర్వో కుటుంబానికి న్యాయం జరుగుతున్నందున , ప్రభుత్వం 658 జీవో ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్ , రిటైర్డ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ మతిఉషారాణి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షుల. భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు. కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author