ప్రతిపక్షాల కుట్రలకు చెక్ పెట్టే కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్తు “
1 min read– ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నదే ప్రభుత్వ ఆశయం.
– ఏప్రిల్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు కార్యక్రమం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అన్ని వర్గాల అభివఅద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. బుధవారం నందికొట్కూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం గోడ పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.”మా నమ్మకం నువ్వే జగన్ అనే మాట ప్రజల నుండి వచ్చిందని.. అందుకే ఆ పేరుతో కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. 14 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ”ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నదే మా ఆశయం. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలి. ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వివరిస్తాం. సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును తెలియజేస్తాం” అని సజ్జల అన్నారు.”ఏడు లక్షల మంది సైనికులు 14 రోజులు సీఎం జగన్ తరపున ప్రతి కుటుంబానికి వెళ్లబోతున్నారు. 87 శాతం మంది ప్రజలు ప్రభుత్వం నుంచి నేరుగా ప్రయోజనం పొందారు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా జరగలేదు. ప్రతిపక్షాల పేరుతో కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టాం. ఏప్రిల్ నుంచి ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం” అని ఎమ్మెల్యే ఆర్థర్ పేర్కొన్నారు.
అణగారిన వర్గాల గొంతుక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ …
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆర్థర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల స్వాతంత్ర్య సమరయోధుడు దళిత బిడ్డ.సంఘ సంస్కర్త,భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , నందికొట్కూరు పట్టణ నాయకులు ఉండవల్లి ధర్మారెడ్డి , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ , నంద్యాల జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సగినేల వెంకట రమణ , నందికొట్కూరు సింగిల్ విండో అధ్యక్షులు సగ్గినెల. ఉసేనయ్య , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి వనజ , వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్ , విశ్రాంత పోలీస్ అధికారి పేరుమాళ్ళ జాన్ , పగిడ్యాల మండలం వైసిపి నాయకులు చిట్టి రెడ్డి , దామరాకుల రాజు, బిజినవేముల మహేష్ మల్యాల శంకరయ్య, అయ్యన్న, భాస్కర్, ప్రవీణ్, యోసేపు, వేల్పుల చిన్న నాగన్న, ఉదయ్ కిరణ్ రెడ్డి, జయరామ్ రెడ్డి, సుంకేసుల వెంకట్, భూశి గౌడ్ , వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.