నవధాన్యాల సాగుపై అవగాహన
1 min read– సయ్యద్ భాష( ప్రకృతి వ్యవసాయం డివిజన్ ఇంచార్జ్)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: నవ ధాన్యాలు సాగుతో నేలతల్లి బాగుంటుందని ప్రకృతి వ్వవసాయ డివిజన్ ఇంచార్జ్ సయ్యద్ భాష రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కురుకుంద గ్రామంలో ప్రక్రృతి వ్యవసాయ విభాగం డివిజన్ ఇంచార్జీ సయ్యద్ బాష 1.20 ఎకరం విస్తీర్ణంలో 30 రకాల నవ ధాన్యాలు వేయడం జరిగింది. ఇందులో ఆహర ధాన్యాలు,చిరు ధాన్యాల, పప్పు దినుసులు, ఆకు కూరలు, తీగ జాతి విత్తనాలు, సుగంధ ద్రవ్యాలు 30 రకాల విత్తనాలు వేయడం జరిగిందని విత్తనాలకు విత్తన గుళికలు వేయడం జరిగిందని తెలిపారు. ఇలా 30 రకాల విత్తనాలు వేయడం వలన భూమిలో కార్భన శాతం పేరిగి భూమి లో ఉండే సుక్మజీవులకు ,వాన పాములకు (ఎరలు)ఆహరం అందడం వలన ఎరలు విత్తనాలు వేరు బుడిపేల పోషాకాలు తీసుకుని నేల సారం అయ్యే విధంగా చేస్తాయని అలాగే భూమి కి కావలసిన 30 రకాల పోషకాలు అంది ప్రధాన పంట కు చీడ పీడల నుండి నివారించడం జరుగుతుందని తెలిపారు. పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చేస్తుందన్నారు. ఇలా ప్రతి రైతు కూడా చేయాడం వల్ల పంట బాగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రక్రృతి వ్యవసాయ సిబ్బంది తో పాటు స్థానిక రైతులు హాజరయ్యారు.