ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు మున్సిపాలిటీ లో డా. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, సమ సమాజ స్థాపనకై కృషిచేసిన నిత్యకృషివలుడు, మూడు దశాబ్దాలు కేంద్రమంత్రిగా విశేష సేవలందించిన తొలి దళిత నాయకుడు, తొలి ఉపప్రధాని, మచ్చలేని నిస్వార్థ నాయకునిగా భారతవనిలో చెరగని ముద్రవేసుకున్న ప్రజానాయకులు డా. బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడువాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా జడ్పీటీసీ సభ్యులు పోచ జగదీశ్వర రెడ్డి , వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , నంద్యాల జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్ , కౌన్సిలర్ లు లాలు ప్రసాద్, పి.చాంద్ భాష, నాయబ్, బొల్లెద్దుల రామక్రిష్ణ, కురువ శ్రీను, మార్కెట్ రాజు, కోసిక తిరుమలేశ్వర రెడ్డి, రైతు సంఘం బాబు, బి.సి నాయకులు కె.వి రమణ, మైనారిటీ నాయకులు అబూబక్కర్, కిరణ్ కుమార్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి , కురువ శ్రీను,పి.రమేష్, ఏసేపు, ఏసన్న, స్వాములు, రాజనాల , తదీతరులు పాల్గొన్నారు.