పేదలకు సేవచేయడమే నా లక్ష్యం
1 min read– శ్రీ పల్లె నరసింహారెడ్డి విశ్రాంత గ్రంథాలయ జిల్లా అధికారి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణం లో ప్రకృతి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు,విశ్రాంత గ్రంథాలయ జిల్లా అధికారి శ్రీ పల్లె నరసింహ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతినెలవృద్ధులుకు, వితంతువులకు, వికలాంగులకు, అనారోగ్యం తో బాధపడుతున్న వారికీ ప్రతి నెల 100₹ దాదాపుగా 150మందికి పంపిణి కార్యక్రమం కు ముఖ్య అతిధిగా విచ్చేసిన కోయిలకుంట్ల ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి చేతుల మీద పెన్షన్ కార్యక్రమం ప్రారంభం అయింది.ఈ సందర్బంగా ప్రకృతి పీఠం అధ్యక్షులు పల్లె నరసింహ రెడ్డి సార్ గారు మాట్లాడుతూ తన తల్లి తండ్రులు దీవెనలు తో ప్రతి నెల తన వంతుగా 100రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడంజరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు సమాజం లో ఎంతోమంది కి తన వంతుగా ఎదోరకంగాసహా యంచేస్తుంటానని ఆయన అన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మాట్లాడుతూ ప్రకృతి పీఠం అధ్యక్షులు పల్లె నరసింహ రెడ్డీగారు ఇలా పేదల కు పెన్షన్ రూపం లో ఇస్తున్న వారిని అభినందించారు. మరెన్నో సాంఘిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, పిల్లలు చిన్నప్పటినుండే తమ తల్లితండ్రులు ను బాగా చూసుకోవాలని అంతేకాకుండా ప్రత్యక్ష దేవుళ్లు తల్లితండ్రులు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది కోయిలకుంట్ల బార్ అసోసియేషన్ మండల ఉపాధ్యక్షులు రాజశేఖర్, విశ్రాంత హెడ్ మాస్టర్ నారాయణ స్వామి,శ్యాం బాబూ,వాల్మీకి నేత సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.