PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగులో.. సూపర్ క్వీన్ 2 ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూల్ : జీవితంలో విజేతలై నిలిచి ప్రేక్షకుల మనసులలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న పదిమంది నటీమణులతో ‘సూపర్ క్వీన్’ అనే రియాలిటీ షోను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతమైన ఈ రియాలిటీ షో రెండో సీజన్ మరోసారి మీ ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు వినోదం పంచుతూనే టైటిల్ కోసం పదిమంది మహిళామణుల మధ్య జరిగే పోరాటమే సూపర్ క్వీన్ 2. ఏప్రిల్ 09న మధ్యాహ్నం 12 గంటలకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుంది. సూపర్ క్వీన్ 2, ఏప్రిల్ 16 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, మీ జీ తెలుగులో!ఈ సీజన్లో విద్యుల్లేఖ రామన్, లిఖిత మూర్తి, మౌనిక యాదవ్, ఎస్తర్, ప్రియాంక, సుస్మిత, పవిత్ర, ప్రశాంతి, సుహాసిని వంటి బుల్లితెర నటీమణులతోపాటు తన డ్యాన్స్తో అభిమానులను సంపాదించుకున్న కండక్టర్ ఝాన్సీ కిరీటం కోసం పోటీపడనుంది. ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వం గల ఈ పదిమంది మహిళామణులు తామేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి ఎవర్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. జీ తెలుగు సూపర్ క్వీన్ 2 రియాలిటీ షో మాత్రమే కాదు, మహిళా శక్తికి జరిగే పట్టాభిషేకం. వినోదభరితమైన టాస్క్లు, స్ఫూర్తివంతమైన ప్రదర్శనలతో షో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుంది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొనివిజయపథంలో నిలిచిన పదిమంది మహిళల ప్రయాణం మరెందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. సూపర్ క్వీన్ 2 టైటిల్ కోసం జరిగే సమరాన్ని ఆరంభించేందుకు టాలీవుడ్ సూపర్ క్వీన్ కాజల్ అగర్వాల్ అతిథిగా రానున్నారు.ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ ప్రపంచంలో ప్రతి మహిళ ఒక సూపర్ క్వీన్. 10 మంది మహిళలు అందం, తెలివితేటలతో పోటీపడే షో ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ క్వీన్ 2 ఒక ప్రత్యేకమైన వేదిక. మహిళలకు వారి నైపుణ్యాలు, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇదో చక్కని అవకాశం అందిస్తుంది. ఈ షో చూసేవారిలోనూ స్ఫూర్తి నింపుతుంది. ఈ వేడుకలో భాగమవడం నేను గౌరవంగా భావిస్తున్నాను. పోటీదారుల మధ్య జరిగే పోటీని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు. పదిమంది మహిళామణుల మధ్య సాగే ఆసక్తికర సమరం ఏప్రిల్ 09 నుంచి, ప్ర తి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో వస్తుంది.

About Author