బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్
1 min read– విశ్వహిందూ పరిషత్ కర్నూలు నగర అధ్యక్షులు టి.సి. మద్దిలేటి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సఫల రాజకీయవేత్త, షెడ్యూల్డ్ కులాల వికాసం మరియు అధికారం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప మహనీయుడు మాన్య శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తేదీ బీహార్ రాష్ట్రంలోని భోజ్పురి జిల్లా చంద్వా గ్రామంలో జన్మించారు.వారి తండ్రి సోభీరాం శఇవనఆరఆయణఈ సంప్రదాయాన్ని పాటించేవారు,తండ్రి బాటలోనే జగ్జీవన్ రామ్ శివనారాయణ సంప్రదాయాన్ని పాటిస్తూ నేను శివుడినీ,నారాయణుడిని కూడా కాబట్టి శివకేశవుల కలయిక నా సంప్రదాయమన్నారు. ప్రతి రోజూ ఇంట్లో శ్రీ రామచరిత మానస్ గ్రంథాన్ని పఠించి అర్థాన్ని చెప్పేవారు జగ్జీవన్ రామ్,అప్పటి సమాజంలో అస్ప్రుశ్యతను తీవ్రంగా వ్యతిరేకించారు.తాను 9 వ తరగతి చదివేరోజులలో పాఠశాలలో మూడు కుండలను ఉంచారని మొదటిది హిందువుల కోసమని,రెండవది ముస్లింల కోసమని,మూడవది అస్ప్రుశ్యల కోసమని ఉంచారు దీనిని గమనించిన జగ్జీవన్ రామ్ తన మిత్రులతో కలిసి వాటిని పగులగొట్టారు,మరుసటి రోజు యాజమాన్యం మరోసారి అలానే ఉంచడం వాటిని కూడా పగులగొట్టినప్పుడు ప్రిన్సిపాల్ ప్రశ్నిస్తే నేర్పే చదువులో అందరూ ఒకటే అని నేర్పుతూ వ్యవహారంలో ఈ బేదభావాలు ఏమిటని గట్టి గా ప్రశ్నించాడు. బాగా చదివి గొప్ప సైంటిస్ట్ కావాలన్న కోరికను చంపుకుని స్వాతంత్ర్య సమరంలో నికి దూకాడని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ గౌరవ జగ్జీవన్ రామ్ కలకత్తా లో నివసించినప్పుడే మాదిగ చర్మవృత్తి వారికోసం రవిదాస్ సంఘాన్ని స్థాపించాడని 1930 లో కొంతమంది కొన్ని సంఘాలను స్థాపించి హిందూ దళితులను క్రైస్తవ మతంలోకి,ఇస్లాం మతంలోకీ మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే గట్టిగా అడ్డుకున్నారని 1936 – 37 సం. లో లక్నోలో కమ్యూనిష్టులు క్రైస్తవ,ఇస్లాం మతాలలోని కి హిందూ దళితులను,హరిజనులు మతాన్ని మార్చాలని ప్రయత్నిస్తే ఆ సభలో గట్టిగా అడ్డుకున్నారని తెలియజేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హిందూ దళిత నాయకులు పవన్,మహిళా నాయకురాలు శ్రీమతి మాలతి గారలను శాలువాతో సన్మానించారు.ఈకార్యక్రమంలో పరిషత్ కర్నూలు నగర నగర ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ పరమాత్మ గారు,శ్రీ శివపురం నాగరాజు గారు సన్మానించారు. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా స్వీట్లు పంచుకొని వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీ అయోధ్య శ్రీనివాస రెడ్డి గారు, జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీ వడ్ల భూపాల్ గారు, నగర కార్యదర్శి శ్రీ ఈపూరి నాగరాజు గారు, నగర బజరంగ్దళ్ సంయోజక్ భగీరథ గారు, తదితరులు పాల్గొన్నారు.