బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్ ఏప్రిల్ 05తారీకు 1908న బీహార్ లోని చాంద్వా గ్రామంలో జన్మించారు . అని డాక్టర్ లంకా శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ,వృత్తిరీత్యా జగజీవన్ రామ్ కుటుంబం వ్యవసాయం చేసేవారు. జగజీవన్ రామ్కు అన్నయ్య ,ముగ్గురు సోదరీమణులు, ఉన్నారు .సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి బాబు జగజ్జివన్ రామ్ తన యొక్క విద్యాభ్యాసాన్ని స్థానిక పాఠశాలలో అభ్యసించిన అనంతరం, కలకత్తాలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ,1931లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1940 డిసెంబర్ 10న వలస రాజ్యాల అధికారులపై జగజీవన్ రామ్ చేసిన అసమ్మతి చర్యలకు అతన్ని అరెస్టు చేశారు. ప్రజలకు న్యాయపరమైన హక్కులను కల్పించడానికి మరియు దళితుల యొక్క రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించేవారు.1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. సుమారు 40 సంవత్సరాలు రాజకీయాల్లో పార్లమెంటు సభ్యుడుగా మంత్రిగా కొనసాగిన బాబు జగజీవన్ రామ్ నిమ్న వర్గాల యొక్క అభివృద్ధికి కృషి చేశారు.1977 – 79 వరకు భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు సమానత్వం హక్కుల కోసం పోరాడిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అని ఓ ప్రకటనలో తెలియజేశారు.