బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్
1 min read– సీఐ మల్లేశ్వరరావు
– మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత..
– ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో చింతలపూడి సొసైటీ చైర్మన్ ఆతుకూరి. సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటుగా, ఆయన ఆశయాలను నెరవేర్చటానికి మనందరం కృషి చేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జివన్ రావు అన్నారు. ఈ సందర్భముగా పలువురు దళిత నాయకులు బాబు జగజీవన్ రామ్ దళితుల కొరకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్సై హరికృష్ణ, దళిత నాయకులు బండి. ఆశీర్వాదం,కాకర్ల సత్యం, పిట్టా. వేణు, విజయానంద్, వైయస్సార్సీపీ నాయకులు గోలి శరత్ రెడ్డి, ప్రగడవరం ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ములగలంపాడు లో బాబు జగజీవన్ రావ్ నూతన విగ్రహాన్ని చింతలపూడి ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి ఆవిష్కరించారు, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు, అన్ని వర్గాల వారిని మరియు శ్రామికులకు, కార్మికులకు, కర్షకులకు ఆయన పదవీకాల మంత్రిత్వ శాఖలలో ఎన్నో ప్రభుత్వ జీవోలను తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నరు, నేటికీ ఆయన సాధించి. తీసుకువచ్చిన పెనుమార్పుతోనే ప్రభుత్వ శాఖలలో పనితీరు కొనసాగుతుందన్నారు, మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం జడ్పిటిసి హరినాథ్ రాజు చింతలపూడి జడ్పిటిసి నీరజ నాయకులు సొంగ రోషన్ కుమార్, పల్లి శ్రీను, మరియు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.