మహిళల ఆర్థిక ప్రగతికి ఆసరా బాసట
1 min read– పాదయాత్రలోనూ, ఎన్నికలలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టు కుంటున్న సీఎం జగన్…
– పాములపాడు లో జరిగిన మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులలో ఎంఎల్ఏ ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాలకు బాసటగా నిలుస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.బుధవారం మండల కేంద్రమైన పాములపాడు లో జరిగిన మండల వైఎస్ఆర్ ఆసరా సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఎల్ఏ ఆర్థర్ మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతు న్నారన్నారు. ఎన్నికల సమయానికున్న డ్వాక్రా రుణాలను నాలుగువిడతలుగా మాపీ చేస్తామని చెప్పి నేటికి మూడు విడతలుగా నిధులను మంజూరు చేసారన్నారు. పాములపాడు మండలం లో వైఎస్ఆర్ మూడవ విడత క్రింద 768 సంఘాలకు రూ 4.93 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాలలో జగన్ ప్రభుత్వం జమ చేయడం చరిత్రాత్మకమన్నారు.
ఉచిత విద్యుత్ ప్రదాత వైఎస్ఆర్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ 108,104 ,ఫీజు రీయంబర్స్ మెంట్ తదితర ఎన్నో పథకాలు ను పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. మూడన్నర ఏళ్ల కాలంలోనే సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, అమ్మఒడి, చేయూత, ఆసరా విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాలును అమలు చేశారన్నారు. చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో చెప్పు శాశ్విత అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.ప్రజలకు మంచి జరిగి ఉంటే పార్టీకి,ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.
సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పా..? అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందిస్తూ,వారి ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ చేయూతనందించడం తప్పా అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు.జగన్ పాలనలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందన్నారు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య,వైద్య రంగాలుకు పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు నేడు పథకాలును పెట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను బాగా చదివించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నిధులను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలలోకి నేరుగా సీఎం జగన్ జమ చేశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయని చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
దుష్ప్రచారాలును తిప్పికొట్టాలి..ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే జగన్ ప్రభుత్వంపై తోడేళ్ళు,గుంటనక్కలు, దుష్ట చతుష్టలు చేస్తున్న దుష్ప్రచారాలును ప్రజలే తిప్పికొట్టాలన్నారు. జగన్ వైపు ధర్మం, న్యాయం ఉన్నాయని,సీఎం జగన్ కు ప్రజలందరూ అండగా నిలవాలన్నారు.చంద్రబాబు పాలన అంతా మోసం,దగా లుతో జరిగిందన్నారు.ప్రకృతి కూడా జగన్ పాలనకు సహకరిస్తోందన్నారు.జగన్ ను మళ్లీ సీఎం అయ్యేందుకు ఆశీర్వదించాలని కోరారు.
మెగా చెక్ అందచేత..వైఎస్ఆర్ ఆసరా మూడవ విడతలో భాగంగా పాములపాడు మండలంలోని 768 సంఘాలకు రూ 4.93 కోట్లు విలువ చేసే మెగా చెక్ ను ప్రజా ప్రతినిధులుతో కలసి ఎంఎల్ఏ ఆర్థర్ అందచేశారు.అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితం..ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఆర్థర్ అన్నారు.నియోజక వర్గ ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్నామన్నారు. ఎటువంటి తప్పుడు పనులు చేయనన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముడియాల లక్ష్మి శ్రీనివాస రెడ్డి , మండల పరిషత్ అధ్యక్షురాలు తొగురు సరోజినీ వర్జీనియా , వైస్ ఎంపీపీ కొండ. వరలక్ష్మి , ఇంచార్జ్ ఎంపీడీవో సుమిత్రమ్మ , డిప్యూటీ తహసిల్దార్ వెంకటరమణ , మండల విద్యాధికారి బాలాజీ నాయక్ , మండల కోఆప్టేడ్ మెంబర్ ముర్తుజా అలీ , వెంపెంట సింగిల్ విండో చైర్మన్ వెంకట రమణ రెడ్డి , మండల నాయకులు చౌడయ్య , వెంకట రమణారెడ్డి , ఏరియా కోఆర్డినేటర్ పుల్లయ్య , ఏపిఎం అనురాధ , మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.