కరువు భత్యం వెంటనే చెల్లించాలి .. ఆపస్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన కరువు భత్యం వెంటనే చెల్లించాలని, సంపాదిత సెలవు నగదు,ఇంకనూ చెల్లించాల్సిన పీఎఫ్, తదితర బకాయిలు చెల్లింపునకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. శ్రావణ్ కుమార్ కోరారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు శ్రీ కమ్మ మల్లికార్జునరావు మాట్లాడుతూ గత పదవ తరగతి పరీక్షలలో పనిచేసి క్రమశిక్షణ చర్యలకు గురైన ఉపాధ్యాయులపై తిరిగి చర్యలు తగవని, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం కృషి చేయాలని ప్రతి చిన్న విషయానికి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయడం తగదని, పరీక్ష రోజు సెలవు ప్రకటించిన పాఠశాలలు తిరిగి సెలవు రోజుల్లో పనిచేయాలనడం సమంజసంగా లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏకేవీకే కళాశాల ప్రిన్సిపాల్ కే వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా బాధ్యులు నరసింహారావు, గుణ ప్రసాద్, టీవీ శేషారావు,ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.