జ్యోతిర్మయిని ఎంబిబిఎస్ చేయించే బాధ్యత నాదే
1 min read-ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎంపీ
-విద్యార్థినికి లక్ష 30 వేల నగదు అందజేసిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన తొగట సుబ్బారావు,పద్మావతి దంపతుల కుమార్తె జ్యోతిర్మయి ఉన్నత చదువు కొరకు నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి లక్ష 30 వేల నగదును వారికి అందజేశారు.గత నెల మార్చి 16వ తేదీన కురిసిన భారీ వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వచ్చిన నంద్యాల ఎంపీకి విద్యార్థిని జ్యోతిర్మయి కర్నూలులోనే ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది.ఆర్థిక స్తోమత వల్ల మాఅమ్మాయిని చదివించడానికి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ విద్యార్థిని మరియు తల్లిదండ్రులు ఎంపీకి తన సమస్యను చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అమ్మాయి చదువుకు తాను తప్పనిసరిగా సహాయం చేస్తానని ఇచ్చిన మాటను ఎంపీ నిలబెట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నంద్యాలలోని ఎంపీ కార్యాలయంలో విద్యార్థిని మరియు తల్లిదండ్రులకు ఎంపీ నగదును అందజేశారు.అదేవిధంగా ఇంటర్లో మంచి ఉత్తీర్ణత తెచ్చుకుంటే నిన్ను ఎంబిబిఎస్ పూర్తి చేయించే బాధ్యత నేనే తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.గత మూడు సంవత్సరాల కిందట మిడుతూరు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో చక్కటి మాటలతో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.చదువుకు సహాయం చేసిన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి విద్యార్థిని మరియు తల్లిదండ్రులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో జలకనూరు ఎంపీటీసీ హరి సర్వోత్తమ రెడ్డి,గ్రామ నాయకులు రామలింగారెడ్డి,రవి, సిరిగిరి పుల్లయ్య,ఆర్ కే నాయుడు తదితరులు పాల్గొన్నారు.