గ్రంథాలయాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలి
1 min read– గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గ్రంథాలయాల అభివృద్ధిలో గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు.గోనెగండ్ల మేజర్ గ్రామపంచాయతీలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గిరిబాబు ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధి – ప్రజల భాగస్వామ్యం అనే అంశం మీద గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధిలో సహకరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.విద్యార్థులు యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించడంతోపాటు ఉద్యోగ అవకాశాల్లో విజయం సాధించే సోపానాలుగా వినియోగించుకోవాలని అన్నారు.రానున్న బడ్జెట్లో 45 లక్షల రూపాయలను కేటాయించి గోనెగండ్ల గ్రంధాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగేశ్ నాయుడు, వైకాపా నాయకుడు మురళి నాయుడు, ఎంపీటీసీ తాయప్ప, హుస్సేన్ పటేల్, బుట్టా గోవిందు, గాజులదిన్నె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.