ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అరికట్టాలి
1 min read– అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: గురువారం అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అరికట్టాలని ఆస్పరి సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఆస్పరి మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న రమేష్ మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొదలైందంటే క్రీడాభిమానులకు పండగే.అంతకంటే ముందు బెట్టింగ్ రాయులకు క్షణం ఖాళీ ఉండదు.గత నెల 31వ తేదీ ప్రారంభమైన ఈ మ్యాచ్ లకు యువత టీవీలకు అతుక్కుపోతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ బెట్టింగులు ఇప్పుడు జిల్లాలో పట్టణాల్లో మండలాల్లో మరియు గ్రామీణ ప్రాంతాలలో కూడా బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి.ఇక బెట్టింగ్లో వేలు,లక్షలు టర్నోవర్ జరుగుతుంది. వీటిల్లో చిక్కుకొని యువత జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొందరు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపైన పోలీసుల నిఘా పెడుతున్న చాటు మాటుగా వీటిని నిర్వహిస్తున్నారు అని అన్నారు. అందువల్ల వెంటనే ఆ బెట్టింగ్ లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు రంగస్వామి సుధాకర్ ధను శ్రీకాంత్ అంపన్న ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రేవన్ తదితరులు పాల్గొన్నారు.