ప్రతీ ఇంటి నుండి ప్రతీ రోజు చెత్తను తప్పక సేకరించాలి
1 min read– పారిశుధ్య విభాగం అధికారులు,కార్యదర్శులు సిబ్బంది కి సూచనలు ఇచ్చిన గంగా ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పట్టణంలో ప్రతీ ఇంటి నుండి ప్రతీ రోజు చెత్తను తప్పక సేకరించాలని పారిశుధ్య విభాగం అధికారులు,కార్యదర్శులను మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్ ఆదేశించారు. పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి చెత్త సేకరణ తీరును పరిశీలించారు.చెత్తను ఎన్ని రోజులకు తీసుకొని వెళ్తున్నారు అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పట్టణ ప్రజలు చెత్తను రోడ్లపై,మురుగు కాలువల్లో పారావేకుండా,మున్సిపల్ వాహనాలకు అందించి పట్టణ పరిశుభ్రత కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,సచివాలయ కార్యదర్శులు పారిసుధ్య సిబ్బంధి తధితరులు పాల్గొన్నారు.కోసమేరుపేంటంటే కే రామాపురం మంగలకాలనీ పోయే మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలోోనాలుగైదు రోజులకు ఒకసారి కూడా చెత్తతీసుకెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.చెత్త బండి వెళ్లేటప్పుడు చెత్త వేయాలి ఆపండి అని కోరిన చెత్త బండ్ల డ్రైవర్లు మళ్లీ వస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారనిసమాచారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉదయమే వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.