ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయండి
1 min read– జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో డాక్టర్లు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య సూచించారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామ బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధాన ప్రారంభోత్సవ మహోన్నత కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో లైవ్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, డిఎంహెచ్వో డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ జఫ్ఫురుల్లా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ప్రభావతి, అడిషనల్ డీఎంహెచ్వో, జిజిహెచ్ సూపర్డెంట్ వరప్రసాద్ తదితరులు వీక్షించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధివిధానాలను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా వైద్యాధికారులకు కేటాయించిన గ్రామాల్లోనే నివాసం ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.