ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలి.. ఆపస్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ మార్కపురం: అనేక రకాల యాప్ లతో పాటు, అధికారుల నిరంతర తనిఖీలు విద్యావ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేకూరుస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. శ్రావణ కుమార్ అన్నారు. మార్కాపురం లోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డివిజనల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యా రంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు నిరంతరం కష్ట పడుతున్నారని, వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు.త్వరలో ప్రారంభమయ్యే పదవ తరగతి మూల్యాంకనం లో అనారోగ్యం తో ఉన్నవారిని, పదవీ విరమణకు రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్న వారిని డ్యూటీ వేయవద్దని వారు కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే ఆపస్ కు అందరూ మద్దతివ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ పరిధిలోని 9 మండలాలలో ఆపస్ శాఖలు ఏర్పాటు చేయాలని డివిజన్ కార్యదర్శి వి.రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, యన్.రమణ, డాక్టర్ రామచంద్ర మూర్తి, తదితరులు పాల్గొన్నారు.