అభివృద్ధి చేయడంలో దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్
1 min read– సంక్షేమ పథకాల గురించి గృహ సారథులు ప్రజలకు వివరించాలి
– గృహ సారథులు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలి
– జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు మరింత చేరవయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారని అభివృద్ధి చేయడంలో దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జగనన్న సైనికులు గృహ సారధులు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో 14 రోజులు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సిపి ఇన్చార్జీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది అని అన్నారు. ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న ప్రజలను కలుసుకొని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను గురించి తెలియజేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ఇందులో భాగంగానే కర్నూల్ నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రహాలు ఇళ్లకు వెళ్లిన తర్వాతమమ్మల్ని జగనన్న పంపారు. మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని ప్రజలకు వివరించాలని అన్నారు.ఏడవ తేదీ నుండి 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే పేరుతో క్యాంపైన్ జరుగుతుందన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గృహ సారధులు వివరిస్తారు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను గృహ సారథులు కలుసుకుంటారని అన్నారు. నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అబద్ధాలతోనే కాలం గడిపాడని అన్నారు. ప్రజా సంక్షేమని పూర్తిగా తుంగలో తొక్కారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారని అన్నారు. ఈ మూడున్నర సంవత్సరాలలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు గురించి క్లుప్తంగా వివరించాలని అన్నారు.