ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
1 min read– సిలువ యాత్రలో భారీగా పాల్గొన్న క్రైస్తవులు
– పాపాత్ములను రక్షించడానికే ఏసుక్రీస్తు శిలువపై మరణించారు
– యాత్రలో పాల్గొన్న వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేసిన 49 బన్నూరు సంఘస్తులు
– దివ్య బలిపూజను సమర్పించిన విచారణ గురువులు శ్యామ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో భక్తిశ్రద్ధల నడుమ గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు.మండల పరిధిలోని ఉప్పలదడియ విచారణ గురువులు జి.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి.ఉప్పలదడియ ఆర్సిఎం చర్చి నుండి శుక్రవారం ఉదయం 8 గంటలకు నుంచి దిగువపాడు కొండపైన ఉన్న కల్వరి కొండ గుడి దగ్గరికి రోడ్డు మార్గాన విచారణలోని ఉప్పలదడియ, మాసపేట,కలమందలపాడు,కడుమూరు,49 బన్నూరు, చౌటుకూరు,దిగువపాడు,దేవనూరు తదితర గ్రామాల్లో ఉన్న ఆర్సీఎం సంగస్తులు కాలినడక నడుచుకుంటూ 14 స్థలాలను స్మరించుకుంటూ పెద్దలతో పాటుగా చిన్నపిల్లలు కూడా ఈసిలువ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం దిగువపాడు కల్వరి కొండ గుడి దగ్గర విచారణ గురువులు శ్యామ్ కుమార్ వాక్య పరిచర్య చేసి దివ్య బలి పూజను సమర్పించారు.ఏసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు గురించి అదేవిధంగా పాపాత్ముల కొరకే ఏసు క్రీస్తు సిలువపై మరణించారని ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధల నడుమ ఉపవాసంతో ఉంటూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. దొంగతనం,అబద్ధం,కక్షలు,ప్రతీకారాలు తదితర విషయాలు దేవునికి విరుద్ధమని దేవునికి వ్యతిరేకముగా ఏ కార్యం చేసినా సరే మనం పాపం చేసిన వారమవుతామని ఆయన అన్నారు. చిట్ట చివరగా ఈ శిలువ యాత్రలో పాల్గొన్న విచారణలోని 10 గ్రామాల ప్రజలకు 49 బన్నూరు సంగస్తుల ఆధ్వర్యంలో ప్రజలకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపదేషులు, పౌలయ్య,డేవిడ్, సామన్న,ఆనందరావు,పకీరయ్య,ఏసన్న,హరిబాబు, ప్రసాద్,సతీష్ మరియు వివిధ గ్రామాల ప్రజలు చిన్నారులు మహిళలు పెద్దలు భారీగా పాల్గొన్నారు.