PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీస్తు సిలువ మరణం ద్వారానే సకల మానవాళికి రక్షణ..

1 min read

– బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా. ఈ లోకంలో ఏసుక్రీస్తు తన సిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ మార్గం చూపించడం జరిగిందని, ఏలూరు బిషప్ జయరావు పొలిమేర అన్నారు, గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులకు, ఏసు క్రీస్తు యొక్క సందేశాన్ని తెలియజేశారు, ప్రభువైన ఏసుక్రీస్తు మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, ఇవన్నీ కూడా మానవాళి రక్షణ కోసం మహోన్నతుడు. ఇచ్చినటువంటి సందేశమని ఆయన తెలియజేశారు, బలి త్యాగమే, అందాకా రా జీవితాల్లో జీవిస్తున్న వారికి వెలుగుపూలు పూయించి, నిరీక్షణ లేని జీవితాల్లో వెలుగు కిరణాలు ఉదయింప చేశాడని ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు విశ్వసించి నడవాలని ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమేర అన్నారు, ఇదే ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే విశిష్టత అని క్రైస్తవ సోదరులకు వివరించడం జరిగింది. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకు ఏర్పాటుచేసిన మార్గం సిలువ మార్గం అని తెలిపారు, ఆ సమయంలో ఏసుక్రీస్తు మాట్లాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్ఠమైనవి అని, తనను హింసిస్తున్న వారిని చూసి ఏసుప్రభు ఇలా చెప్పెను ” తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేరుగరు గనుక వీరిని క్షమించ అంటూ చేసిన ప్రార్థన నాభూ తో భవిష్యత్తు గా చెప్పుకుంటారు. మనల్ని ప్రేమించే వారి కోసం ప్రార్థించాలి అన్న ఏసు సిలువలో చెబుతున్న వారికోసం ప్రార్థించాలి అన్న ఏసు సిలువలో చెబుతున్న వారికోసం యేసు చేసిన ప్రార్థన, తండ్రియగు దేవుడు మానవుల రక్షణ కొరకు బలియాగం లో కూడా తాను సమృద్ధిగా మిగిలిపోవడానికే సిద్ధపడతాడు తప్ప ఎవరిని నిందించలేదు. కాబట్టి మానవులమైన మనం దేవుని యందు భయభక్తులు కలిగి, తోటి వారి యందు ప్రేమ మార్గంలో నడవవలెనని, ఆయన ఇచ్చిన శాంతి సందేశం అని ఆయన విశ్వాసులకు ప్రభు యొక్క సందేశం లను తెలియజేశారు. సాయంత్రం క్రీస్తు సిలువ యాగాన్ని అనే యువతి. యువకులు చేపట్టగా క్రైస్తవులందరూ పురవీధులలో క్రైస్తవ గీతా లాప నలతో, ప్రత్యేక ప్రార్థనలతో సిలువ యాగాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జి మోజెస్, ఫాదర్ ఐ మైఖేల్, తదితర ఫాదర్లు, జక్కుల బెనర్జీ, మటకన్యలు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.

About Author