మలిదశ ఉద్యమం..తీవ్రతరం..
1 min readఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందే..
ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరికుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉద్యమం ఆగదన్నారు ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి. కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వములో AP JAC అమరావతి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మలిదశ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శనివారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కెవై కృష్ణ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లకండువాలు ధరించి… డిమాండ్లతో కూడిన APJAC అమరావతి పోస్టర్ ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రి గేట్ వద్ద, కలెక్టరేట్ ముందున్న మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పోస్టర్లను ఆవిష్కరించి…నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా APJAC అమరావతి రాష్ట్ర కోశాధికారి మురళీ కృష్ణ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే మున్ముందు ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల నాయకులైన పంచాయతీరాజ్ ఇంజినీర్ల జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు,డ్రైవర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రావు గారు, మునిసిపల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట రెడ్డి , APPTD జిల్లా నాయకులు శ్రీనివాస రావు, APPTD కార్మిక పరిషత్ రీజియన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, DRDA ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు గిడ్డయ్య, రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప, సహకార శాఖ రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ నాగారమణయ్య గారు,వి.ఆర్.ఓ ల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్య బాబు కోశాధికారి మద్దిలేటి వైస్ ప్రెసిడెంట్ స్వామన్న, గ్రామ వార్డ్ సచివాలయాల జిల్లా అధ్యక్షులు ప్రతాప్, రాముడు రామాంజనేయులు, నాగార్జున వి.ఆర్ .ఏ ల సంఘ నాయకులు శ్రీ రవి, లోకేష్ శివ తదితరులు పాల్గొన్నారు.