ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదే
1 min read– మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా
పల్లెవెలుగు వెబ్ అన్నయ్య జిల్లా: ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి ఘనత జగన్ అన్నదేనని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి . పేర్కొన్నారు.శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలో సంఘం వాల్లపల్లి గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోరాజకీయాలకతీతంగా కుల మతాలకతీతంగా ప్రతి కుటుంబానికిప్రభుత్వం తరఫున లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిఉన్నారన్నారు.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి రాబోవు 2024 ఎన్నికలలో కూడావైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి గ్రామ సర్ పంచ్ స్వామి, ఏంటీ టీసీ ఆంజనేయులు సర్పంచులు నేతి ఆంజనేయులు ,గోపీనాథ రెడ్డి, గ్రుహ సారధుల మండల కన్వీనర్ నరేష్ స్వామి వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు తదితరుల పాల్గొన్నాడు.