దేశ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే సాధ్యం
1 min read– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల అమలు
డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 6 సూత్రాల అమలు చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు, శనివారం ఆయన చెన్నూరులో కాంగ్రెస్ నాయకులు సందాని ఇచ్చిన విప్తార్ విందు కు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో (రోజా )ఉపవాసం ఉంటారని వారికి ఇఫ్తార్ విశిష్టత దాని ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది, అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు విధి విధానాల గురించి రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల అమలు చేస్తామని, ముఖ్యంగా రైతులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని, వారు పండించిన పంటకు మద్దతు ధర లేక ఆత్మహత్యల శరణ్యమనే విధంగా బ్రతుకుతున్నారని, అలాంటివారు బ్యాంకు రుణాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు లక్షల రూపాయలు బేషరతుగా ఒకేసారి రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు, అలాగే మహిళలు వంటింట్లోకి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని, నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర 450 రూపాయలు ఉండేదని, నేడు 1200 వందలకు చేరిందన్నారు, దీనిని ఐదు వందలకు ఇచ్చే విధంగా చూడడం జరుగుతుందన్నారు, అలాగే రాష్ట్రంలో 15% కుటుంబాలు ఇంకా కటిక దరిద్రం లో నివసిస్తున్నాయని ఆ కుటుంబాలకు ఆసరాగా నెలకు 6000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, రాష్ట్రానికి సంజీవిని అయిన ప్రత్యేక హోదా అమలయితే పెట్టుబడుదారులకు కేంద్ర పన్నుల్లో అనేక రాయితీలు లభిస్తాయని అందుకోసం పెట్టుబడు దారులు రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారని, తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలియజేశారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని జరుగుతుందన్నారు దీంతో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నబడిన అపరిస్కృతంగా ఉన్న ఎస్ ఏ ఐఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం లో ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు , విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో తదితర అన్ని సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కమలాపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, వెంకటేష్ శర్మ, చీకటి చార్లెస్, రాష్ట్ర కార్యదర్శి కెక, చంద్రశేఖర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి జయరామిరెడ్డి, జానకిరామ్, అంకల్ రెడ్డి ,నారాయణరెడ్డి, సంతా నీ భాష, వెంకట్రావు, యేసయ్య, సమీవుల్లా, హబీబ్, షఫీఉల్లా, జమీర్, కాజా, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.