PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరి సహకారంతో ముందుకెళ్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి ,డోన్: అందరి సహకారంతో కోర్టు అభివృద్ధికి ముందుకెళ్దామని డోన్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రేగటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గత వారంలో డోన్ కోర్టు లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కమిటి సోమవారం కొలువు తీరింది. అధ్యక్షుడు గా రేగటి రాజశేఖర రెడ్డి , కార్యదర్శిగా శేష శయన రావు, సహాయ కార్యదర్శిగా బాల రంగడు,ఉపాధ్యక్షుడు శివ రామకృష్ణ, ట్రెజరిగా మంగమురి శ్రీను, మహిళా న్యాయవాది రెప్రరెంటిజివ్ కుమారిలు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా రేగటి. రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సహకారంతో కోర్టును మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి సబ్ కోర్టు నిర్మాణానికి పూర్తి చేసుకుందామన్నారు.ప్రస్తుతం ఉన్న సబ్ కోర్టులో సౌకర్యాలు లేక న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా కోర్టు ఆవరణలో మరుగుదొడ్లు లేక న్యాయవాదులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాటిని వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలను ఎన్నికల రోజు వరకే చూడాలని మిగిలిన సమయంలో అందరం సమానంగా ఉండాలని పిలుపునిచ్చారు.కోర్టు అభివృద్ధికి ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరూ సమానమే అన్నారు. అనంతరం పలువురు న్యాయవాదులు నూతన కమిటీని పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సందు వెంకట రాముడు, న్యాయవాదులు నాగభూషణం రెడ్డి, కానాల మహేష్,గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నరసింహులు,రామలింగయ్య,బద్దల వెంకటేష్,భాస్కర్ నాయుడు, మధు,రాముడు, జెబిఉల్లా,మద్దయ్య యాదవ్,రవిమోహన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author